ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనంతపురం కలెక్టరేట్లో ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన అంశాలను... సమస్యత్మక గ్రామాల వివరాలను డివిజన్ల వారిగా ఎస్ఈసీ తెలుసుకున్నారు. ఈ గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై డివిజన్ల వారిగా.. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. కట్టుదిట్టుమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ధేశించారు.
ఇదీ చదవండీ.. ఉపాధి బకాయిల వివరాలివ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం