రానున్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్‌ను పోటీకి నిలిపాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద నివాళులు అర్పించి మంత్రి సునీత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. జిల్లాలో 2 నియోజకవర్గాల్లో తనకు, తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరినట్లు మంత్రి సునీత తెలిపారు. రాప్తాడుతోపాటు మరో నియోజకవర్గం కేటాయించలేకపోతే, ఈసారి తన స్థానంలో శ్రీరామ్‌ను పోటీకి నిలపాలని కుటుంబ సభ్యులు, పరిటాల అభిమానుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం తమ అభ్యర్థన ముఖ్యమంత్రి ఎదుట ఉంచుతామని, అధినేత నిర్ణయం మేరకు ముందుకెళతామనిపరిటాల సునీత ప్రకటించారు.
తన తల్లి సునీత, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే తాను రాప్తాడు నుంచి బరిలో దిగుతానని శ్రీరామ్ స్పష్టం చేశారు. పరిటాల సునీత, శ్రీరామ్కనగానపల్లె మండలం ముత్తవకుంట్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తల్లీ, కుమారుడికి పూలజల్లుతో ప్రజలు స్వాగతం పలికారు.
ఇవి కూడా చూడండి