అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉయ్యాల సేవ ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడికి అర్చకులు ప్రత్యేక శ్రద్ధలతో పూజలు చేశారు. స్వామివారిని సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం రంగ మండపంలోని పీఠంపై శ్రీవారికి పుష్పార్చన, తులసి అర్చనలు ఆగమోక్తముగా చేపట్టారు.
ఇదీ చదవండి : శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దర్శనాలు పునఃప్రారంభం