చంద్రప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి - కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలతో నరసింహుడిని శోభాయమానంగా అలంకరించారు. అర్చకులు రాజగోపురం ముందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam at kadhiri in ananthapuram