అనంతపురం జిల్లా మడకశిర మండలం భక్తరపల్లిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, జిల్లేడుగుంట ఆంజనేయ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల భక్తులతో ఘనంగా నిర్వహించేవారు. ఈ ఏట కరోనా కారణంగా దేవాదాయ శాఖ అధికారులు కేవలం గ్రామస్తులతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మ రథోత్సవం క్షేత్రపాలకుడైన జిల్లేడు గుంట ఆంజనేయ స్వామి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేశారు. పూలతో అలంకరించిన దివ్య రథోత్సవంపై స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచారు. మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి హాజరయ్యారు.
ఇదీ చదవండి: