ETV Bharat / state

అమ్మ ఆకాశం.. ఆమే రక్షణ కవచం... నేడు మాతృదినోత్సవం! - అనంతపురం జిల్లా తాజా వార్తలు

కరోనా.. అందరినీ కష్టాల్లోకి నెట్టేసింది. కట్టుకున్నవారిని పొట్టనబెట్టుకుంది. కన్నపేగులను మెలిపెట్టింది. ఇలాంటి విప్కర పరిస్థితుల్లో సైతం ‘అమ్మ’ త్యాగం అభినందనీయం. బిడ్డల సేవ ఆదర్శనీయం. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో మాతృమూర్తుల ప్రత్యేక కథనం మీకోసం.

special-story-on-mothers-day-in-ananthapuram-district
అమ్మఆకాశం ఆమే రక్షణ కవచం... నేడు మాతృదినోత్సవం
author img

By

Published : May 9, 2021, 3:49 PM IST

అమ్మ కోసం..నింగి ఒంగి వందనమంది.. తనకన్నా గొప్ప మనసుందని.

నేల శిరస్సు ఒంచి ప్రణమిల్లింది.. తనను మించిన సహనశీలి ఉందని.

గాలి వచ్చి వాలిపోయింది.. ప్రాణాలు పణంగా ఊపిరిపోసిందని.

నీరు సైతం కదిలొచ్చింది.. ప్రాణం నిలిపే వారిని చూద్దామని.

నిప్పు ఆశ్చర్యంగా చూసింది.. పిల్లలకు రక్షణవేళ దహించే ధైర్యమేదని.అమ్మ..

సమస్య ఎదురైతే..పరిష్కారం తానవుతుంది.

అపాయం కనబడితే.. రక్షణ కవచంగా మారుతుంది.

చీకటి చుట్టుముడితే.. వెలుగై దారి చూపుతుంది.

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయసుల వారిని భయాందోళనకు గురిచేస్తున్న తరుణమిది. ఇలాంటి పరిస్థిల్లోనూ తొణకనిది కన్న ప్రేమే. కరోనా మహమ్మారి తమను వేధిస్తున్నా.. మనసు తల్లడిల్లుతున్నా పిల్లలను దూరంగా ఉంచి కాపాడుకున్నారు. తాడిపత్రిలోని చేనేత కాలనీలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వహించే విజయలక్ష్మికి గతేడాది కరోనా వైరస్‌ సోకింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారికి కొవిడ్‌ సోకకుండా నెల రోజుల పాటు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉండాల్సి రావడంతో పిల్లలు దగ్గరకు వస్తుంటే కాదనలేని కన్నప్రేమ ఓ వైపు, వస్తే వారెక్కడ వైరస్‌ బారిన పడతారోననే చింతన మరో వైపు తీవ్రంగా వేధించాయి. మనో నిబ్బరం, కుటుంబ సభ్యుల సహకారంతో కరోనాను జయించి బిడ్డల చెంతకు చేరారు. పది రోజుల కిందట 8, 7 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. మనో ధైర్యంతో తనకేమైనా ఫరవాలేదని పిల్లలు ఒంటరి తనానికి గురికాకుండా తగిన జాగ్రత్తలతో వారికి చేరువగానే ఉంటూ సేవలందిస్తున్నారు విజయలక్ష్మి.

తల్లికి అన్నం తినిపిస్తున్న బాలూనాయక్‌

బాలూనాయక్‌ కదిరి ఆర్టీసీ డిపోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తన తల్లి లక్ష్మమ్మ వయసు 75 ఏళ్లు. నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన ఆమెకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించక పోయాడు. మోకాళ్ల నొప్పులు, నరాల బలహీనత, మూత్రస్రావం వంటివి తల్లిని బాధిస్తున్నాయి. సంతానంలో చిన్నవాడైన బాలూనాయక్‌కు అమ్మంటే ఎంతో ఇష్టం. అందుకే అక్క, అన్నలు ఉన్నా.. తల్లిని తానే చూసుకుంటున్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం శ్రమించిన ఆమెకు 20ఏళ్ల కిందట మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. దీంతో అడుగు వేయలేని స్థితి.

దీనికి తోడు నరాల బలహీనతతో చేతులు వెనక్కు మెలితిరిగాయి. ఫలితంగా ఏపనీ స్వతహగా చేసుకోలేని దయనీయం. ఇవి చాలదన్నట్లు గర్భసంచి సమస్య వల్ల నిత్యం మూత్రవిసర్జన జరుగుతుండటం ఇబ్బందికర పరిస్థితి. అయినా బాలూనాయక్‌ తన ఆనందాలు, అవసరాల కంటే అమ్మకోసం సమయం కేటాయిస్తారు. ఉదయం ముఖం కడిగించటం, స్నానానికి సాయం చేయటంతో పాటు అన్నం తినిపించటం ముగించి ఉద్యోగానికి వెళ్తారు. రాత్రి భోజనం చేయిస్తారు. తలదువ్వటం, దుస్తులు కట్టుకోవటానికి సాయం చేస్తూ వయోవృద్ధురాలైన తల్లిని చంటిబిడ్డలా.. కంటిపాపలా కాపాడుకుంటున్నారు. జన్మనిచ్చిన అమ్మకు అన్ని సేవలు చేయటం తన జీవితానికి సార్థకత కలుగుతుందన్న భావన ఆనందం ఇస్తుందని బాలూనాయక్‌ చెప్పారు.

సేవల గంగ.. తరించగా!

తల్లి సేవలో గంగాదేవి

ఆ ముగ్గురు ఆడపిల్లలను కూలిచేసి, రాత్రి సమయంలో టైలరింగ్‌ చేసి, చదివించి, ప్రయోజకులను చేసిన ఆ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు మడకశిర మండలం చీపులేటికి చెందిన గంగాదేవి అనే యువతి. కుమారుడు లేని లోటు తీర్చాలని భావించించారు. కరోనా బారిన పడి హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న తల్లికి సేవలు అందిస్తున్నారు. గంగాదేవి విద్యాశాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లికి ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా ఉండటంతో ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మరో వైపు ఆసుపత్రిలో చేరిన తండ్రికి, చెల్లికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. వారికి ఆక్సిజన్‌, మందులు అందేలా చూస్తున్నారు. ‘అమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆక్సిజన్‌ లెవల్స్‌ చాలా తక్కువగా ఉన్నాయి. ముగ్గురు కుమార్తెలను తీర్చిదిద్దిన తల్లిని కాపాడుకొంటే చాలు. మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం. మాకు మా అమ్మ ముఖ్యం’ అంటున్నారు ఆ కుమార్తెలు.

తల్లికోసం.. తనయుల వనవాసం

కరోనా కల్లోలం ఎవరినీ వదల్లేదు. తల్లిని కాపాడుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములను వనవాసం చేయించింది. తలుపులకు చెందిన నారమ్మ వయసు 92ఏళ్లు. కుమారులు కృష్ణయ్య, నారాయణ. ఉద్యోగాల నిమిత్తం కదిరిలో స్థిరపడ్డారు. ఆమెకూడా ఇక్కడికే వచ్చి ఉంటున్నారు. వయసు మీదపడిన ఆమెకు కాలు, చేయి ఆడుతున్నా.. చెవులే పూర్తిగా వినపడవు. అర్థమయ్యేలా చెప్పాలన్నా కష్టమే. అలాంటి ఆమెకు ఏప్రిల్‌ మూడో వారంలో కరోనా వైరస్‌ సోకింది. పరీక్షలు చేయించి, చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఏమైందో తెలియక కుదురుగా ఉండక, అందరితో మాట్లాడాలి.

ఆరుబయట తిరగాలని పట్టుపట్టారు నారమ్మ. చేసేది లేక రెండు రోజుల పాటు తల్లితో పాటు కొడుకులు వరండాలో జాగారం చేశారు. వీలుకాక పోవటంతో తలుపులలోని వ్యవసాయ బావివద్దకు మకాం మార్చారు. అక్కడ తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్నారు. పగటివేళ చెట్లకింద కాలం గడిపారు. వైద్యులు సూచించిన మందులు, కషాయం ఇస్తూ, ఆవిరి పట్టడం వంటి సపర్యలతో కోలుకునేలా కష్టపడ్డారు. రెండు వారాలు వనవాసం చేశారు. 92ఏళ్ల వయసులో కరోనాను జయించి ఆరోగ్యం కుదుట పడటంతో వందేళ్ల ఆయువుకు భయం లేదని సంతోష పడ్డామని అన్నదమ్ములు కృష్ణయ్య, నారాయణ తెలిపారు.

ఇదీ చదవండి:

ఇంటివద్దకే రేషన్‌: వాహనాలను తిరిగిచ్చేసిన 10మంది ఆపరేటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.