కదిరి డివిజన్ పరిధిలోని 12 మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఈనెల 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, పోలింగ్ రోజున చేపట్టే బందోబస్తు, తదితర అంశాలను ఎస్పీ సత్య ఏసుబాబు సమీక్షించారు.
పోలింగ్ ప్రశాంతగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఓబులదేవరచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ చెక్ పోస్ట్ తనకల్లు, నల్లచెరువు మండలాల్లో ఎస్పీ పర్యటించారు. ఆయనతోపాటు కదిరి డీఎస్పీ భవ్యకిశోర్ ఉన్నారు.
ఇదీ చదవండి: