ETV Bharat / state

కన్న తండ్రిని 2 నెలలుగా చిత్రహింసలు పెడుతున్న సుపుత్రుడు - అనంతపురం జిల్లా వార్తలు

కొడుకుంటే పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను గట్టెక్కిస్తాడు అంటారు. ఇది ఎంత నిజమో.. తెలియదు కానీ.. ఈ సుపుత్రుడు మాత్రం కంటికి రెప్పలా పెంచిన కన్న తండ్రినే చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. రెండు నెలలుగా కొడుతూ, తిడుతూ నానా ఇబ్బందులు పెడుతున్నాడని కన్నతండ్రి పోలీసుల వద్ద బోరుమన్నాడు.

son torcher
son torcher
author img

By

Published : Oct 16, 2020, 6:28 PM IST

అనంతపురం నగరంలోని మునిసిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్​గా పని చేస్తున్న తన కొడుకు హర్షవర్ధన్ నిత్యం కొడుతున్నాడని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కుమారుడు కొడుతున్నాడని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రెండు నెలల నుంచి చిత్రహింస పెడుతున్నా.. కొడుతున్నా.. మౌనంగా భరించానని లక్ష్మి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లోకి రానీయకుండా చేస్తున్నాడని, ఉన్న ఆస్తిని అమ్మేస్తూ జల్సాలు చేయొద్దని చెప్పినందుకు తన కుమారుడు ఇష్టం వచ్చినట్లు చావ బాదుతున్నాడని బాధితుడు లక్ష్మీనారాయణ కన్నీటి పర్యంతమయ్యాడు. కుమారుడి చేష్టలు శృతిమించడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అయితే రెండు నెలలుగా పోలీస్ ల చుట్టూ తిరుగుతున్నా.. న్యాయం చేయలేదని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్​గా పాల్గొన్న జగన్​, గడ్కరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.