అనంతపురం జిల్లా తలుపుల మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతిక లోపం వల్ల ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. తలుపుల కుమ్మరపేట వద్ద ఉన్న విద్యుత్ ఉప కేంద్రంలోని కెపాసిటర్ బ్యాంక్ సిలిండర్లో సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది అప్రమత్తతో వెంటనే సమస్యను గుర్తించి మరమ్మతులు చేశారు. ఫలితంగా మంటలను అదుపులోకి వచ్చాయి. అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదం జరిగేదని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి తెలిపారు. సిబ్బంది సకాలంలో స్పందించి మరమ్మతులు చేయడం వల్లే ప్రమాదం తప్పిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: