ETV Bharat / state

ఆంజనేయ స్వామి రథోత్సవంలో అపశ్రుతి... విద్యుదాఘాతంతో ఒకరి మృతి - గుమ్మగట్ట పోలీసులు తాజా వార్తలు

ఆంజనేయ స్వామి రథోత్సవంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం వైద్యంగుండ్లపల్లిలో జరిగింది. గ్రామంలోని పురవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది.

short circuit at gummagatta mandal one died four injured
రథోత్సవంలో అపశ్రుతి విద్యుదాఘాతంతో ఒకరి మృతి
author img

By

Published : Dec 29, 2020, 2:31 PM IST

Updated : Dec 29, 2020, 3:06 PM IST

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం వైద్యంగుండ్లపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ వేకువజామున రథోత్సవంలో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా... రథం విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుదాఘాతంతో బోయ లోకేష్ (25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మారన్న (40), గంగాధర (28), సంతోష్ (6), నాగేంద్ర (12)లు తీవ్ర గాయాల పాలయ్యారు.

చికిత్స కోసం క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న మారన్న, సంతోష్​ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

ఆంజనేయ స్వామి రథోత్సవంలో ఆనందంగా గడిపిన గ్రామ ప్రజలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. రాయదుర్గం ఆసుపత్రి ఆవరణలో బంధువులు ఆర్తనాదాలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. కేసు నమోదు చేసిన గుమ్మగట్ట పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఐదుగురు అరెస్ట్

Last Updated : Dec 29, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.