దేవుడు, దెయ్యం వీటి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవుడిని ఆరాధించేవారిని పండితులు, పూజారులు అని దెయ్యాన్ని పూజించేవారిని క్షుద్ర మాంత్రికులు అని పిలుస్తారు. అనంతపురం జిల్లా కదిరి మండలం సోమేష్నగర్లో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపింది. ఓ కాలనీలో ఇంటిముందు పసుపు కుంకుమ, దిష్టిబొమ్మ, కోడికాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వదిలి వెళ్లారు. దీంతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వాటిని తొలగించారు. ఈ వ్యవహరంపై దర్యాప్తు చేస్తామని పోలీసులు అన్నారు.
ఇదీ చదవండి:'కలికిరిలో రోడ్డు ప్రమాదాలపై డెమో'