ETV Bharat / state

రైలు ఢీకొని గొర్రెలు మృతి - గొర్రెలు మృతి వార్తలు

అనంతపురం జిల్లా ఎం.కొత్తపల్లి గ్రామంలో రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందాయి. జీవనోపాధి కోల్పోయానని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

Sheep killed in train hits
రైలు ఢీకొని గొర్రెలు మృతి
author img

By

Published : Sep 14, 2020, 10:05 AM IST

రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ గొర్రెల యజమాని వాటిని మేతకు తీసుకెళ్లాడు. పట్టాల సమీపంలో గొర్రెలు ఉండగా.. రైలు వచ్చింది. ఆ శబ్దానికి గొర్రెలు చెల్లాచెదురై.. కొన్ని రైలు కింద పడ్డాయి. ప్రమాదంలో మొత్తంగా 16 గొర్రెలు మరణించాయి. తనకు లక్షా నలభై వేల రూపాయల నష్టం వాటిల్లిందని యజమాని ఆవేదన చెందాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

ఇవీ చూడండి:

అనంతపురం జిల్లాలో కుండపోత వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.