అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో రాత్రి వీచిన ఈదురు గాలులకు అరటి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కళ్యాణదుర్గం, శెట్టూరు, కంబదూరు, కుందుర్పి మండలాల్లో బలంగా వీచిన గాలులకు పలువురు రైతులకు చెందిన మామిడి కాయలు అధికంగా రాలిపోయాయి. ముదిగల్లు గ్రామంలో రైతు మంజునాథకు చెందిన 200 అరటి చెట్లు నేలపాలయ్యాయి. శెట్టూరు మండలంలో గాలి తాకిడికి పలు చెట్లు విద్యుత్ తీగలపై విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా... యుద్ధప్రాతిపదికన ట్రాన్స్కో అధికారులు మరమ్మతులు చేపట్టారు.
ఇదీ చదవండి: కుమారుడి కళ్లెదుటే... రిక్షాలో కరోనాతో తండ్రి మృతి