అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలం గోళ్ల గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
గత కొంతకాలంగా..
గ్రామంలో గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య తరచుగా విభేదాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు వాగ్వాదాలకు దిగాయి. గ్రామంలోని మోహన్ రెడ్డి, సూరి వర్గాలు ఘర్షణ పడగా.. రామ్మోహన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడు రామ్మోహన్ను కల్యాణ దుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : ఎంపీ రఘురామను అందుకే అరెస్టు చేశాం.. సీఐడీ ప్రకటన