ETV Bharat / state

సచివాలయ సిబ్బంది చేతివాటం.. పింఛన్​లో వెయ్యి రూపాయల కోత!

కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. పింఛన్​ పుస్తకాన్ని అందించాలంటే 1000 రూపాయలు చెల్లించాలంటూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరులో చోటుచేసుకుంది.

secretariat-staff-taken-thousand-rupees-from-pension-beneficiaries-at-ananthapuram
సచివాలయ సబ్బంది చేతివాటం.. పింఛన్​లో వెయ్యి రూపాయల కోత!
author img

By

Published : Jan 3, 2022, 9:58 AM IST

Updated : Jan 3, 2022, 10:33 AM IST

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల కేంద్రంలోని సచివాలయం - 2 సిబ్బంది పింఛన్ పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. కొత్త పింఛన్ పుస్తకాలు ఇవ్వాలంటే వెయ్యి రూపాయల ఇవ్వాలని లబ్ధిదారులకు తెలిపారు. పింఛన్ పంచే సమయంలో... వెయ్యి రూపాయలు కోత విధించి 1500 రూపాయలు మాత్రమే చెల్లించారు. స్థానికులు ఈ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం... చేతివాటం ప్రదర్శించిన సచివాలయం సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

సచివాలయ సబ్బంది చేతివాటం.. పింఛన్​లో వెయ్యి రూపాయల కోత!

ఇదీ చూడండి: ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్​కు 3 వేల ఎకరాలే!

Last Updated : Jan 3, 2022, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.