అనంతపురం జిల్లాలో ఈ నెల 11 నుంచి 31 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ సిరి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల 60 వేల మంది మొదటి డోసు టీకాను వేసుకున్నారని, వీరందరికీ రెండో డోసు అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం రెండో దశకు సంబంధించిన వ్యాక్సిన్ 14 వేల డోసులు ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయని వెల్లడించిన జాయింట్ కలెక్టర్.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు.
రెండో దశ టీకా వేసే సమయంలో మొదటి డోసును ఎవరికీ అందించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి 31వ తేదీ వరకు రెండో డోసు వారికే టీకా వేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశ టీకా వేసుకోవాల నుకునేవారు జూన్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకుని... ఆయా కేంద్రాల్లో టీకాను వేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొదటి దశ టీకా పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ రెండవ దశ టీకాను వేసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: