కాలనీలో మురుగునీరు బయటకు వెళ్లేందుకు దారి చూపాలంటూ.. అనంతపురం జిల్లా రొద్దం తహసీల్దార్ కార్యాలయం ముందు తురకలపట్నం గ్రామస్థులు ధర్నా చేపట్టారు. తన పొలం గుండా నీరు డ్రైనేజీకి వెళ్లే మార్గంలో ఓ రైతు అడ్డుకట్ట వేయడంతో.. ఎస్సీ కాలనీలో దుర్గంధం వ్యాపించిందని పేర్కొన్నారు. తమ సమస్యను తీర్చాలని ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసనకు దిగారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రెండురోజుల్లో పరిష్కరిస్తామని తహసీల్దార్, ఎంపీడీవోల హామీతో ప్రజలు వెనుదిరిగారు.
ఇదీ చదవండి: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: శంకర్ నారాయణ