ETV Bharat / state

Sand shortage in Anantapur district : కరవు జిల్లాలో ఇసుక కొరత.. చివరికి కృత్రిమ ఇసుకలోనూ...

Sand shortage in Anantapur district : అనంతపురం జిల్లాలో ఇసుక కొరత నిర్మాణరంగాన్ని కుదేలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 20 ఇసుక రీచ్ లను గుర్తించినప్పటికీ.. కేవలం పది మాత్రమే పనిచేస్తున్నాయి. ఇసుక లభ్యత కష్టం కావటంతో ప్రత్యామ్నాయంగా రోబోశాండ్ వాడకం తప్పనిసరైంది. కృత్రిమ ఇసుకతో నిర్మాణ రంగానికి మేలు అయినప్పటికీ....రాతిపొడిని కల్తీచేసి వినియోగదారులను మోసగిస్తున్నారు. ఈ కల్తీ పై అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Sand
Sand
author img

By

Published : Feb 22, 2022, 7:48 PM IST

Sand shortage in Anantapur district : అనంతపురం జిల్లాలో ఇసుక కొరత అక్రమార్కులకు డబ్బు సంపాదన మార్గాలను ఏర్పరచింది. లాక్ డౌన్‌తో ఎక్కడికక్కడ ఆగిపోయిన నిర్మాణాలు మళ్లీ ఊపందుకున్నాయి. దీనికి తోడు జగనన్న శాశ్వత గృహనిర్మాణ పథకం అమలు చేస్తున్నందున .. అన్నిచోట్లా నది నుంచి తీసుకొచ్చే ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కొరతను అధిగమించటానికి రోబో శాండ్‌ ను తయారు చేయాలని ఇంజనీరింగ్ నిపుణులుల ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నారు. కంకర రాళ్లను క్రమ పద్దతిలో ఇసుక రేణువులుగా మార్చి, ప్రత్యేక జల్లెడ ద్వారా రోబోశాండ్ ను తయారు చేస్తున్నారు. ఈ కృత్రిమ ఇసుక నిర్మాణాలు నదీ ఇసుక కంటే పటిష్టంగా ఉంటాయి. అయితే ఈ ఇసుకలో కంకర డస్ట్ కలిపి విక్రయాలు చేస్తుండటం ప్రమాదంగా మారుతోంది. ఇసుక దొరకక పోవటంవల్లనే కృత్రిమ ఇసుక కొనుగోలు చేస్తున్నట్లు భవన యజమానులు చెబుతున్నారు.

కరవు జిల్లాలో ఇసుక కొరత.. చివరికి కృత్రిమ ఇసుకలోనూ కల్తీ

ఇళ్లు కట్టడానికి మొదలు పెట్టినప్పటి నుంచి ఇసుకకు రేటు పెరిగింది. కొనుగోలు చేయలేకపోతున్నాం. దాని బదులు డస్టును వాడుతున్నాం. లైఫ్ టైం తక్కువ అని చెబుతా మాకు తప్పట్లేదు. ఇసుక ఎటుపోతుందో అర్థం కావట్లేదు. -సూర్యనారాయణ, భవన యజమాని

అనంతపురం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం 20 చోట్ల ఇసుక రీచ్ లను గుర్తించగా.....దీనిలో పది రీచ్ లలో మాత్రమే తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలో వేగవంతమైన నిర్మాణాలకు రోజూ ఆరు వేల టన్నుల ఇసుక అవసరం ఉండగా, ప్రస్తుతం రెండు వేల టన్నులు మాత్రమే లభ్యమవుతోంది. కొందరు కంకర మిషన్ల యజమానులు, పరిశ్రమ వృథాగా చెప్పే డస్ట్ ను రోబోశాండ్ లో కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ డస్ట్ తో జరిగే నిర్మాణాలు నాణ్యంగా ఉండవని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కరవు జిల్లాలో గ్రామీణులకు ప్రధాన ఉపాధి మార్గంగా ఉన్న నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను కొరత లేకుండా సరఫరా చేయాలని భవన యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : NGT On Illegal sand mining: ఇసుక అక్రమ తవ్వకాలపై సమాధానమివ్వండి...ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.