ETV Bharat / state

ప్రపంచ శాంతిని కోరుతూ విశాఖ భక్తుల సామూహిక వ్రతాలు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విశాఖ భక్తులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. ప్రపంచమంతా శాంతి, సౌఖ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

author img

By

Published : Aug 26, 2019, 8:20 AM IST

సామూహిక వ్రతాలు
ప్రపంచ శాంతిని కోరుతూ విశాఖ భక్తుల సామూహిక వ్రతాలు

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విశాఖ జిల్లా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యసాయి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియంలో విశ్వశాంతికి, విశ్వమానవ కల్యాణానికి భక్తులు వ్రతాలు నిర్వహించారు. సత్యసాయి నామాలను కీర్తిస్తూ గణపతి పూజ, సహస్ర లింగార్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు. మహామంగళహారతి ఇచ్చి పూజను ముగించారు. ప్రపంచ మానవాళి హృదయాల్లో సత్యసాయి కొలువై ఉన్నారని ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ తెలిపారు. సాయి ప్రేమతత్వంతో 150 దేశాల్లో భక్తులను సేవా మార్గం వైపు పయనింప చేశారన్నారు. సేవ, ప్రేమతోనే దైవత్వం సిద్ధిస్తుందని తెలిపారు. దేవుడు కొలువై ఉన్న సత్యాన్ని గ్రహించి ఆపద సమయంలో తోటి మానవునికి చేయూతను అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సేవ తత్వమును అలవర్చుకోవాలి అన్నారు.

ఇది కూడా చదవండి.

"జర్నలిస్టుపై దాడి అత్యంత హేయమైన చర్య"

AP_SKLM_100_25_ATTN_TICKER_AP10172 FROM: CH. ESWARA RAO, SRIKAKULAM. AUG 25 Note:- today (26-08-2019) ticker points ------------------------------------------------------------------------------------------- శ్రీకాకుళం: అమరావతి బయలుదేరి వెళ్తున్న ఆశా కార్యకర్తలను ఎక్కడకక్కడ అడ్డుకున్న పోలీసులు, చాలా మందిని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు, అక్రమ అరెస్టులను ఖడించిన ఆశా వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి. జిల్లాలో ఆధార్ కేంద్రాలు తాత్కలికంగా మూసివేత, రేషన్ సరుకుల కోసం ఆధార్, ఈకేవైసీ ప్రస్తుతం అవసరం లేదు, చౌక ధరల దుకాణాలలో ఈకేవైసీ చేసుకోవాలి, 15 సంవత్సరాలలోపు పిల్లలకు పాఠశాలల్లోనే ఆధార్ నమోదు కార్యక్రమం చేపడతాం, రానున్న మూడు నెలల కాలంలోఈ ప్రక్రియ జరుగుతుంది: జేసీ శ్రీనివాసులు. ప్రతీ సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌, ఫోన్‌ చేయాల్సిన నెంబర్లు: 08942-240605, 08942-240606. కలెక్టర్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమం. జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం. శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమం. ఆమదాలవలస: సరుబుజ్జిలిలో మండల తెదేపా కార్యకర్తలతో మాజీ ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ సమావేశం. పాలకొండ: సీతంపేట ఐటీడీఎ కార్యాలయంలో స్పందన కార్యక్రమం. వీరఘట్టం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నేటి నుంచి భాషోత్సవాలు. ఎచ్చెర్ల: రణస్థలం ఇండోర్‌ స్టేడియంలో ఈరోజు బ్యాడ్మింటన్‌ ఎంపికలు, మధ్యాహ్నం 2 గంటలకు అండర్‌-16 బాల బాలికల విభాగాల్లో ఎంపికలు. పలాస: పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘంలో వార్డు గ్రామవాలంటీర్ల ఆధ్వర్యంలో ఇళ్ళు లేని లబ్ధిదారులను గుర్తింపు. ఇచ్చాపురం: సోంపేటలో నేడు ఉట్టి ఉత్సవం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.