విత్తన వేరుశెనగ కోసం అనంతపురం జిల్లా ధర్మవరం రైతులు రోడ్డెక్కారు. ధర్మవరం మార్కెట్ యార్డులో వేరు శనగ విత్తనాలు తీసుకునేందుకు పలు గ్రామాల నుంచి రైతులు వచ్చారు. స్టాక్ లేకపోవటంతో వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ కేంద్రాల వద్దకు రాలేదు. ఆగ్రహించిన రైతులు ధర్మవరం-బత్తలపల్లి రహదారిపై బైఠాయించారు. సుమారు గంటపాటు రైతులు నినాదాలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వ్యవసాయ అధికారులతో, రైతులతో ఎస్సై మాట్లాడారు. ఈనెల 21న విత్తన పంపిణీ ఉంటుందని అధికారులు చెప్పడంతో రైతులు వెనుదిరిగారు.
ఇది కూడా చదవండి.