అనంతపురం జిల్లా ఉరవకొండలో పాఠశాలకు ఒకే బస్సులో 150 నుంచి 160 దాకా విద్యార్థులు వెళ్తూ ఉండటం చూసిన 'ఈటీవీ భారత్' వారి సమస్యను పరిష్కరించింది. కొన్ని రోజుల క్రితం 'పేరుకే ఆదర్శం వెళ్లాలంటే భయం భయం' అనే వార్తను ఈటీవీ భారత్‌లో చూసిన ఆర్టీసీ అధికారులు స్పందించి ఇక్కడ మరొక బస్సు ఏర్పాటు చేశారు. దాంతో విద్యార్థులు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. తమ పాఠశాలకు రెండు బస్సులను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించిన ఈటీవీ భారత్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి