అనంతపురం జిల్లా హిందూపురంలో కొవిడ్ కారణంగా గత కోన్నిరోజులుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటంతో బుధవారం నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరించారు.
జిల్లాలోని అనంతపురం, కదిరి, కొడికొండ చెక్‌పోస్టు, కొత్త చెరువు ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని...అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని అధికారులు సూచించారు.