కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ తీవ్రత తగ్గడం లేదు. ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలైనా.. ప్రజల్లో కరోనా భయం తొలగని కారణంగా.. రద్దీ అంతగా కనిపించడం లేదు.
అనంతపురం జిల్లా మడకశిర ఆర్టీసీ డిపో నుంచి అనంతపురానికి 2 సూపర్ లగ్జరీ.. పెనుగొండకు 2 ఆర్డినరీ బస్సులు వేశారు. వీటిలో మొదటి రెండు బస్సుల్లో కాస్త ప్రయాణికులు కనిపించినా.. మూడో బస్సు మాత్రం ఎవరూ రాకపోయేసరికి మళ్లీ డిపోకు వెళ్లిపోయింది. ప్రజల్లో కరోనా భయంపై తొలగని భయాందోళనలే.. ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: