అనంతపురం జిల్లా మడకశిర మండలం జమ్మానిపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే కోడిగుడ్లు కుళ్లి, పగిలిపోయి ఉన్నాయి. తమ గ్రామంలో నాణ్యతలేని, కుళ్లిన, దుర్వాసన వస్తూ… పురుగు పట్టిన కోడిగుడ్లు కేంద్రానికి చేరాయని గ్రామస్థులు వాపోయారు. తాము ప్రశ్నించినందుకు అంగన్వాడీ సిబ్బంది బయటపడేశారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కోడిగుడ్ల సరఫరాపై దృష్టి సారించి ప్రజలకు నాణ్యమైన కోడిగుడ్లు అందించాలని కోరారు.
ఇదీ చదవండి :