తుపాను ప్రభావంతో అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల గుంతలు పడ్డాయి. ఆ రోడ్లపై ప్రయాణం చేయడానికి వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు. గాండ్లపెంట మండలం కటారుపల్లి నుంచి గొడ్డువెలగల, తుమ్మలబైలు, సాధులవాండ్లపల్లికి వెళ్లే దారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మార్గంలో భారీగా రాకపోకలు సాగుతాయి. వాహనదారులలు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నా.. అధికారులు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేదు.
ఈ నేపథ్యంలో రహదారులు రోజురోజుకు దెబ్బతింటున్నాయని స్థానికులు అంటున్నారు. కొన్నిచోట్ల వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడం వల్ల మడుగులను తలపిస్తున్నాయి. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు, వాహన చోదకులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: