ETV Bharat / state

రహదారి విస్తరణ పనులు జరిగేనా.?

అనంతపురం జిల్లా, కదిరి పట్టణంలోని హిందూపురం రహదారి విస్తరణ పనులు.. ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు.. అన్నచందంగా తయారయ్యాయి. వేమారెడ్డి కూడలి నుంచి కోనేరు కూడలి వరకు పనులు చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే పలుమార్లు సర్వే చేపట్టారు. పరిహారం విషయంలో తేడా వస్తుండడం కారణంగా స్థానికుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది.

Road widening in Kadiri town Anantapur district
రహదారి విస్తరణ పనులు జరిగేనా.?
author img

By

Published : Jan 12, 2021, 5:03 PM IST

స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా అనంతపురం జిల్లా, కదిరి పట్టణంలోని హిందూపురం రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడంలేదు. వేమారెడ్డి కూడలి నుంచి కోనేరు కూడలి వరకు రహదారి విస్తరణ కోసం అధికారులు పలుమార్లు సర్వే నిర్వహించారు. ప్రతిసారీ కొలతల్లో తేడాలు వస్తుండడం.. స్థానికుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు రోడ్డు పనులు చేపట్టాలంటే.. స్థానికులు తమ సొంత స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను తొలగించాలి. ఫలితంగా విస్తరణకు సహకరించాలని.. అధికారులు స్థానికులకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. తొలగించిన వాటికి పరిహారం బదులు టీడీఆర్ వర్తింప చేస్తామని నోటీసులో తెలిపారు. దీనికి ఇంటి యాజమానులు నిరాకరించారు. భూసేకరణ చట్టం ప్రకారం.. తమకు పరిహారం చెల్లించిన తర్వాతే విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్​ను ఇంటి యజమానుల సంఘం కలిసింది. టీడీఆర్ విషయంలో తమ అభ్యంతరాన్ని తెలియజేస్తూ.. కమిషనర్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి: వాలంటీర్​ని తొలగించారని కాలనీ వాసులు ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.