ETV Bharat / state

ప్రగతి దారిలో అనంత.. నిధుల విడుదలకు కేంద్రం సుముఖత - అనంతపురంలో రోడ్ల అభివృద్ధి వార్తలు

అనంత నగరాభివృద్ధికి మరో అడుగు పడింది. అర్బన్‌ లింక్‌ వైడెనింగ్‌ పథకం కింద నాలుగు వరుసల రహదారి, నగర నడిబొడ్డున 4 వరుసల వంతెన నిర్మించనున్నారు. రూ.310 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. పంగల్‌ రోడ్డు నుంచి టీవీ టవర్‌, కలెక్టరేట్‌, సూర్యానగర్‌, టవర్‌క్లాక్‌ మీదుగా బళ్లారి చౌరస్తా వరకూ 8 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి నిర్మిస్తారు. టవర్‌క్లాక్‌ సమీపంలో ప్రస్తుతం ఉన్న వంతెనను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.

road development works in ananthapuram
ప్రగతి దారిలో అనంత
author img

By

Published : Oct 17, 2020, 3:14 PM IST

అనంతపురం నగర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నిధుల విడుదలకు సుముఖత వ్యక్తంచేసింది. విజయవాడలో కనకదుర్గ ప్లైఓవర్‌ బ్రిడ్జిని శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రితో కలిసి వర్చువల్‌ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అనంత ప్రాజెక్టు అమలుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రహదారి నిర్మాణానికి రూ.90 కోట్లు ప్రకటించారు. అదనంగా రూ.220 కోట్లు కావాలని ముఖ్యమంత్రి కోరగా.. గడ్కరీ అంగీకారం తెలిపారు.

నగరంలోని కనకదాస విగ్రహం నుంచి తడకలేరు వరకూ 5 కి.మీ. మేర రూ.51 కోట్లతో 4 వరుసల రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మార్గం అధ్వానంగా ఉండేది. రెండు వరుసల ఈ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నందున పాతూరు ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది. పంగల్‌రోడ్డు వరకు నిర్మిస్తే నగర శివారులోని రహదారులన్నీ అభివృధ్ధి చెందినట్లే.

వంతెన సమస్యకు పరిష్కారం

గడియార స్తంభం సమీపంలోని రెండు వరుసల పై వంతెన బలహీనంగా ఉంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో వంతెన నిర్మించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వంతెనపై నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతోంది. వంతెన విస్తరించాలని ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. ఇప్పటికి మోక్షం లభించింది.

ఇక్కట్లు తొలగినట్టే

పంగల్‌ రోడ్డు నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్రస్తుతం 2 వరుసల రహదారి ఉంది. అది కూడా అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు అడుగుకో గుంత ఏర్పడింది. ట్రాఫిక్‌ పెరిగింది. గుంతల రోడ్డులో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారి నిర్మాణానికి రూ.90 కోట్లు మంజూరయ్యాయి. అయితే టెండరు ప్రక్రియ పూర్తికాలేదు. వాస్తవానికి బళ్లారిరోడ్డు నుంచి పంగల్‌రోడ్డు వరకూ ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉండగా ఇటీవల జాతీయ రహదారుల జాబితాలో చేర్చారు. ఈ రహదారి అభివృద్ధికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషి చేస్తున్నారు. కేంద్రమంత్రి హామీతో రహదారికి మహర్దశ వచ్చినట్లే.

ప్రతిపాదనలు పంపించాం

గడియార స్తంభం సమీపంలోని ప్లై ఓవర్‌ బ్రిడ్జి విస్తరించాలని ప్రతిపాదనలు పంపించాం. అలాగే 42వ నెంబరు జాతీయ రహదారి బళ్లారి చౌరస్తా నుంచి పంగల్‌రోడ్డు వరకూ 4 వరుసల రహదారికి ప్రతిపాదనలు పంపించాం. కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే టెండరు ప్రక్రియ ఆరంభమవుతుంది. - మధుసూదన్‌, ఈఈ, జాతీయ రహదారులశాఖ

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

కేంద్రమంత్రి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. నగరాభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. గుత్తిరోడ్డు, కలెక్టరేట్‌ నుంచి ఉప్పరపల్లి వరకూ రోడ్డు అభివృద్ధి చేస్తానని గతంలోనే చెప్పాను. అర్బన్‌ లింక్‌ వైడెనింగ్‌ పథకం కింద ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నా. - అనంత వెంకటరామిరెడ్డి, శాసనసభ్యుడు

ఇవీ చదవండి..

ఇంద్రకీలాద్రిపై వినసొంపైన కేరళ సంగీతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.