అనంతపురం నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కూడేరు మండలం కొర్రకోడు గ్రామానికి చెందిన కూలీ కుంటెప్ప.. వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో అనంతపురానికి బయల్దేరాడు. వేగంగా వస్తున్న ద్విచక్రవాహనానికి రాచనపల్లిలో రాగానే కుక్క అడ్డు వచ్చింది. దీన్ని తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం డివైడర్ను ఢీ కొట్టింది. బైక్పై ఉన్న వ్యక్తి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగలడంతో తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీధర్ రెడ్డి చెప్పారు.
ఇదీ చూడండి: తిరుమల శ్రీవారికి స్వర్ణ శంఖుచక్రాలు బహూకరణ