అనంతపురం జిల్లా రాప్తాడు ఎస్వీఐటీ కళాశాల సమీపంలో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కారులో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రగాయాలైన ఆమె భర్తను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి