ETV Bharat / state

మహిళా కళాశాల ప్రిన్సిపాల్ వేధింపుల ఫిర్యాదుపై ఆర్జేడీ విచారణ

హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆర్జేడీ విచారణ చేపట్టింది. కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం ఉందన్నారు. త్వరలోనే నివేదికను మహిళా కమిషన్​కు అందజేస్తామని తెలిపారు.

author img

By

Published : Nov 30, 2020, 8:25 PM IST

rjd enquiry on hindupur womens degree college principal
మహిళా కళాశాల ప్రిన్సిపల్ వేధింపుల ఫిర్యాదుపై ఆర్జేడీ విచారణ

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆర్జేడీ(రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఫర్ ఎడ్యుకేషన్) తనిఖీలు చేశారు. ఇటీవల ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక విద్యార్థులు చేసిన ఆందోళనలు, టీచర్లు.. ప్రిన్సిపాల్​పై మహిళా కమిషన్​కు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ ఆదేశాల మేరకు కళాశాలతో విచారణ చేపట్టినట్లు ఆర్జేడీ తెలిపారు. ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలిందని.. పూర్తి నివేదికను త్వరలో మహిళా కమిషన్​కు సమర్పిస్తామన్నారు.

విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కళాశాలకు మహిళా ప్రిన్సిపాల్​ను కేటాయించేలా సంబంధిత అధికారులకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్​పై చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండీ:

అమానుషం: విషం కలిపి తల్లి, చెల్లిని కడతేర్చిన కిరాతకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.