ETV Bharat / state

భవిష్యత్తులో నీటి కొరత తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం..! - water risk latest news

మనం నివసించే భూగోళంలో 70 శాతం పైగా నీరే. ఇందులో శుభ్రమైన నీరు చాలాతక్కువ. భూమిపై ఉన్న మెుత్తం నీటిలో 2.7 శాతం మాత్రమే మంచి నీరు కాగా, ఇందులోనూ 75శాతం మంచు రూపంలోనే ఉంది. నదులు, సరస్సులు, భూగర్భ జలాల్లో ఉన్న నీటిలోనూ మానవవినియోగానికి, అవసరాలకు ఉపయోగపడేది కొద్ది పరిమాణం మాత్రమే. ఇప్పటికే ప్రపంచంలో 80దేశాలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో నీటి కొరత తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదముందని అనేక నివేదికలు చెబుతున్నాయి. నీరు సైతం స్టాక్ మార్కెట్లో అమ్మకానికి పెట్టడం వల్ల.. జరిగే పరిణామాలపైనే అందరూ దృష్టి పెట్టారు.

Risk of further increase in water scarcity in future ..!
భవిష్యత్తులో నీటి కొరత తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం..!
author img

By

Published : Dec 17, 2020, 5:08 AM IST

భవిష్యత్తులో నీటి కొరత తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం..!

నీరు లేనిదే ప్రాణం లేదు. పంటలు, పరిశ్రమల్లేవు. కానీ ఆ నీరు అన్నిచోట్లా ఉండదు. ఎడారులు, కొండలు, వానచుక్క ఎరగని పొడి నేలలు.. ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోనూ మనుషులుంటారు. వాళ్లకు తాగడానికి, తిండి గింజలు పండించుకోవడానికి నీరు కావాలి. అందుకే... ప్రకృతి ఇస్తే తప్ప మరోరకంగా పొందలేని ఈ నీటి వనరు మార్కెట్ వస్తువుగా మారటం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించటమే కాదు... భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తోంది.

భూమ్మీద మూడొంతుల నీరున్నా.. పేద దేశం నుంచి పెద్ద దేశం దాకా నీటికి కటకటే. 2025 నాటికి 180కోట్ల మంది పైగా ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని అంచనా. వ్యవసాయం సహా ఇతరత్రా అవసరాల కోసం వర్షాభావ ప్రాంతాల్లో నీటి కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. నిపుణులు లెక్కలు వేస్తున్న తరుణంలోనే... నీరు అరుదైన వనరుగానే కాక మార్కెట్‌ వస్తువుగానూ మారిపోయింది. కాలిఫోర్నియాలో నీటి సరఫరా చేసే సీఎంఈ గ్రూపు వాల్‌స్ట్రీట్‌ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో నీటిని చేర్చడంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రకృతి వనరైన నీటిని..ఇప్పటివరకూ ధనిక, పేద అనే తేడా లేకుండా అంతా సమానంగా పొందుతున్నారు. ట్రేడింగ్‌ వల్ల భవిష్యత్తులో ఆ అవకాశం ఉండదని వాతావరణ నిపుణులు భయపడుతున్నారు.

వాస్తవానికి కాలిఫోర్నియా కొంతకాలంగా తీవ్రమైన నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతోంది. అవసరాలకు అనుగుణంగా నీటి వనరులు అందుబాటులో లేకపోవటం వల్ల పరిమితంగా ఉన్న నీటికి ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే సరఫరాకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే అక్కడే నీటిని మార్కెట్‌ వస్తువుగా ట్రేడింగ్‌లో పెట్టారు. దీనివల్ల ప్రణాళికాబద్ధంగా నడుచుకోవటానికి వీలు అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇదే సమయంలో నీటి కొరత అంతగా లేని దేశాల్లో నీటిని మార్కెట్ వస్తువుగా మార్చే అవకాశం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొంతకాలంగా నీటిని శుద్ధి చేసి తాగునీరుగా అమ్మటం మెుదలైనా.. ఎక్కడా ఈ విధంగా బంగారం, ముడిచమురు తరహాలో నీటిని ట్రేడింగ్ వస్తువుగా చేసిన సందర్భాల్లేవు. ఈ విధానం వల్ల సంపన్నులు...అధికమెుత్తంలో నీటిని కొనుగోలు చేయడం వల్ల సామాన్యులకు అందుబాటులో నీరుండదనే భయాందోళనలు అప్పుడే వినిపిస్తున్నాయి. కొందరు నిపుణులు మాత్రం ఇప్పట్లో అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. ఇతర మార్కెట్ వస్తువుల్లా నీరు పరిమిత వనరు కాదని.. అందరు పర్యావరణాన్ని కాపాడుకుంటే... నీటి వనరుల్ని పెంపొందించుకోవచ్చునని సూచిస్తున్నారు. ట్రేడింగ్‌లో నీటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.

ఏదీ ఏమైనా అభివృద్ధి మాటున మానవుడు తన స్వార్థం కోసం చేస్తున్న ప్రకృతి విధ్వంసం.. ఈ పరిస్థితికి కారణమైంది. ఏ కొద్దిమందో చేసిన తప్పులకు ప్రపంచం నలుమూలల ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాగేందుకు నీళ్లు దొరక్క.. నానా కష్టాలు పడుతున్నారు. ఈ నీటి సంక్షోభం 2050 నాటికి మరింత తీవ్రం అవుతుందని అనేక నివేదికలు వస్తున్న తరుణంలో సకాలంలో మేల్కొని తక్షణ చర్యలు తీసుకోకపోతే...అగ్రరాజ్యం సహా అనేకదేశాలు ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండీ... ఏలూరు వింత వ్యాధికి పురుగు మందులే కారణం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.