ETV Bharat / state

అలా ఇలా బతకడం కాదు.. 'ట్రీ హౌస్' లా జీవించాలి..! - anantapur news

Tree House: వాయుసేనలో సుదీర్ఘకాలం సేవలందించిన ఓ అధికారి ఉద్యోగ విరమణ తరువాత తన ఇల్లునే ఉద్యానవనంగా మార్చుకున్నారు. పర్యావరణ ప్రేమికుడైన ఆయన ప్రకృతిలో లభించే ప్రతి వస్తువూ పనికొస్తుందని నమ్మారు. కొబ్బరి చిప్పలు, వెలగకాయ, ఎండిపోయిన కొమ్మలతో అపురూపమైన వస్తువులు తయారుచేస్తున్నారు. అనంతపురం జిల్లాలో విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ ఇంటి విశేషాలు ఇవి.

tree house
ట్రీ హౌస్
author img

By

Published : Jan 7, 2023, 9:58 AM IST

Tree House: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో కల్లూరు వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. అక్కడ 20 సెంట్ల భూమిలో విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ దంపతులు జీవవైవిధ్యం పరిఢవిల్లేలా వారి ఇంటిని మర్చుకున్నారు. లక్ష్మీనారాయణ వాయుసేనలో పనిచేసి పదవీ విరమణ పొందారు. తన ఇద్దరు పిల్లలు బెంగళూరు, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ దంపతులు మాత్రం సొంత ఊరిలోనే ఉండాలని భావించారు. తమకున్న 20 సెంట్ల స్థలంలోనే వివిధ రకాల చెట్లను పెంచుతూ.. ప్రకృతి ఒడిలో జీవనం సాగిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అన్నీ ప్రకృతి సిద్ధమైన వస్తువులనే వాడారు. కొబ్బరి, నేరేడు, మామిడి చెట్ల కొమ్మలు ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్నా వాటిని విరచకుండా పైకప్పుకు రంద్రం పెట్టి పూర్తి చేశారు. అనంతరం తన ఇంటికి "ట్రీ హౌస్" అని పేరు పెట్టుకున్నారు.

లక్ష్మీనారాయణ ట్రీ హౌస్‌కు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇంటి ఆవరణ వృక్షాల నుంచి లభించే కలప, వ్యర్థాలను ఉపయోగించుకుని అపురూపమైన వస్తువున్ని తయారు చేస్తున్నారు. ఆయనకు తన భార్య ఉమామహేశ్వరి కూడా చేదోడువాదోడుగా ఉంటోంది.

లక్ష్మీనారాయణ తయారు చేసిన వస్తువుల్ని, తన ఇంటిని చూసేందుకు పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు వస్తుంటారు. వాటిని చూసి విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతూ, అపురూప కళారూపాలను సొంతంగా తయారు చేస్తున్న లక్ష్మీనారాయణ దంపతులు పలువురికి ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.

"ఇండియన్ ఎయిర్​ఫోర్స్​లో రిటైర్ అయిన తరువాత.. ఇది మా మా సొంత ఊరు. ఇక్కడ 20 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలంలో నేచురల్​గా ఉండే విధంగా తయారుచేసుకొని.. ఉండాలని నా ఉద్దేశం. కొన్ని చెట్లు కర్ణాటక, కేరళ నుంచి తెప్పించాను". - లక్ష్మీనారాయణ, వాయుసేన విశ్రాంత అధికారి

"ఆయన ఏం తయారుచేసినా మద్ధతు ఇస్తాను. అలంకరణ చేస్తూ ఉంటాను". - ఉమామహేశ్వరి, లక్ష్మీనారాయణ భార్య

"ప్రకృతిలో లభించే ఏ వస్తువూ నిరుపయోగం కాదు అని మేం తెలుసుకుంటూ.. మా స్కూల్ పిల్లలకు నేర్పించడానికి వారిని ఇక్కడకు తీసుకొనివచ్చాం. ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి". - రాధిక, ఉపాధ్యాయురాలు

ఆకట్టుకుంటున్న ట్రీ హౌస్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.