స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలని అనంతపురం జిల్లా, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలను కోరారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో బాలకృష్ణ పాల్గొని.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సేవాభావంతో ఎన్టీఆర్ క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేశారని అన్నారు. కరోనా విపత్కాలంలోనూ వైద్యులు అంకితభావంతో నాణ్యమైన సేవలందించారని కొనియాడారు.
ఇదీ చదవండి: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్