అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పారిశ్రామిక వార్డులో రేషన్ బియ్యాన్ని గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న తొమ్మిది మందిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
పక్కా సమాచారంతో..
పక్కా సమాచారం అందుకుని తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. అందులో భాగంగా రేషన్ బియ్యం డీజిల్ ఆటోల్లో తరలిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
200 బస్తాల బియ్యం బస్తాలతో..
అనంతరం నిందితుల వద్ద నుంచి 200 బస్తాల బియ్యం ప్యాకెట్లతో పాటు 4 డీజిల్ ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. వీరందరిని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : గుంటూరు జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు...నలుగురు మృతి