ఇంటివద్దకే నిత్యావసరాలు పంపిణీ చేయలేమంటూ వాహన ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో 20మంది వాహన ఆపరేటర్లలో పది మంది..తమ వాహనాలను తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. తమకు వస్తున్న 21 వేల రూపాయల్లో... పెట్రోలు, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని... ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సీడీ రావడం లేదని ఆపరేటర్లు వాపోతున్నారు. తమకు వచ్చే జీతంలో ఏమీ మిగలట్లేదని... తాము వెట్టిచాకిరి చేయడం తప్పా.. ప్రయోజనం లేదని అందుకే వాహనాలకు తిరిగి ఇచ్చేశామని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు. తాము వాహనం తీసుకునే సమయంలో... 70వేల రూపాయల వరకూ ఖర్చు పెట్టామని.. వాటిని ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని చెబుతున్నారు.
ఇదీ చదవండీ... భార్య ఒడిలోనే ప్రాణం వొదిలిన కరోనా బాధితుడు