అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని... స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేశాయి. సంస్థల ఐకాస అధ్వర్యంలో నల్లచొక్కాలు ధరించి ర్యాలీ చేపట్టారు. రెండు నెలల నుంచి బ్లడ్ బ్యాంక్ కోసం ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదంటూ విమర్శలు చేశారు. జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు.. తమ ప్రభుత్వం ఏర్పాటైతే రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు.
ఇదీ చదవండి: