కడప జిల్లాలో...
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడపలో ముస్లిం నాయకులు ఆందోళన చేపట్టారు. రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. బాబ్రీ మసీదు, గోమాంసం, త్రిపుల్ తలాఖ్ వంటి అంశాలపై తాము రోడ్డెక్కలేదన్నారు. కాళ్ల కింద ఉండే భూమిని లాగేసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లాలో..
ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురంలో ముస్లిం జేఏసీ మహిళలు నిరసన చేపట్టారు. టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ఔట్ సోర్సింగ్ కార్మికులను ఇష్టారీతిన బదిలీ చేస్తున్నారు'