ETV Bharat / state

గెలిచిన సర్పంచ్​లకు​ రఘువీరారెడ్డి అభినందనలు - ananthapuram latest news

మడకశిర నియోజకవర్గంలో జరిగిన నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్​లు, వార్డు అభ్యర్థులకు ఆ పార్టీ నేత రఘువీరారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సర్పంచ్ అభ్యర్థులకు రఘువీరారెడ్డి అభినందనలు

author img

By

Published : Feb 22, 2021, 6:24 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో జరిగిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సొంత పంచాయతీ గంగులవాయిపాలెంతోపాటు పక్కనున్న గోవిందపురం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కళావతి, అనితాలక్ష్మి సర్పంచ్​లుగా గెలుపొందారు. గెలిచిన వారికి రఘువీరారెడ్డి అభినందనలు తెలిపారు.

సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ... రఘువీరారెడ్డి బలపరిచిన అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచాం. రఘువీరా అభివృద్ధిని చూసి పంచాయతీ ప్రజలు ఓటు వేసి గెలిపించారు. మమ్మల్ని గెలిపించిన ఓటర్లకు, రఘువీరా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:
పోలీసులు ఇంట్లో చొరబడి .. ఆడపిల్లలను, చిన్నపిల్లలను కూడా కొట్టారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.