అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పార్వతి నగర్ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రోడ్లు భవనాల శాఖలో గ్యాంగ్ మెన్‌గా పనిచేస్తున్న ఆంజనేయులు అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లి ఊరు వెళ్లగా చెల్లితో ఉంటున్నాడని స్థానికులు వెల్లడిస్తున్నారు. కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: