ఇదీ చదవండి :
చేప కోసమై వల వేస్తే... కొండచిలువ చిక్కెన్..! - చేపల వలలో చిక్కిన కొండ చిలువ న్యూస్
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన జాలర్లు కొందరు... చేపల కోసం వల వేస్తే అందులో కొండ చిలువ చిక్కింది. కొండచిలువ చిక్కిన సమాచారాన్ని జంతు రక్షణశాఖ సిబ్బందికి అందించారు మత్స్యకారులు. వారు కొండచిలువను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సాయంతో పట్టుకొని... అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
చేప కోసమై వలలో పడినే కొండచిలువ
చేపల కోసం వల వేసిన జాలర్లకు భారీ కొండ చిలువ చిక్కిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగింది. గతరాత్రి బుక్కపట్నం చెరువులో జాలర్లు చేపల కోసం వల పెట్టారు. ఇవాళ వలను బయటకు తీయగా.. అందులో కొండచిలువ చిక్కుకొని ఉండడం గమనించారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం పుట్టపర్తిలోని జంతు సంరక్షణ శాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అటవీశాఖ సిబ్బంది సాయంతో కొండ చిలువను వలలో నుంచి బయటకు తీసి.. బోనులో బంధించారు. అనంతరం అమగొండ పాళ్యం అటవీ ప్రాంతంలో వదిలేశారు.
ఇదీ చదవండి :
sample description