Public Facing Problems Poor Condition of Roads in Anantapur District : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఆర్. కొట్టాల నుంచి డొనేకల్లుకు వెళ్లే మార్గంలో తారురోడ్డు నిర్మాణ పనులను మధ్యలో నిలిపేయడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారి ఆధునికీకరణలో భాగంగా రెండు గ్రామాలు మధ్య 90 లక్షలతో 2 కిలోమీటర్ల మేర తారురోడ్డు నిర్మాణాన్ని పంచాయతీరాజ్ అధికారులు చేపట్టారు. నాలుగు నెలల క్రితం రెండు కిలో మీటర్ల దారిని తవ్వి కంకర పరిచారు. గుత్తేదారులకు నిధులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
విడుదల కాని బకాయిలు - నిలిచిపోయిన రోడ్డు పనులు - ప్రజలకు తిప్పలు
Roads Situation In Anantapur : పొలానికి నీళ్లు పారించడానికి రాత్రి వేళల్లో వెళ్లాల్సి వస్తుందని, ఆ సమయంలో కంకర పరిచి ఉన్న రోడ్డు పై ప్రయాణం ఎంతో ప్రమాదకరంగా ఉందని రైతులు వాపోతున్నారు. రోడ్డు నిర్మిస్తామని పనులు చేపట్టినట్టే చేసి ఇప్పుడు అధికారుల నిర్లక్ష్య ధోరణి పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఈ మార్గంలో తాము ఎన్నో ప్రమాదాలను ఎదుర్కున్నామని ప్రజలు తెలిపారు.
రోడ్లపై ఎందుకు ఇంత కక్ష! జగనన్న హయాంలో రోడ్ల వేయడం కాదు - వేసిన రోడ్డునూ దోచుకెళ్ళిపోతున్నారు
Road Consructions Stopped : పట్టించుకునే నాధుడు లేడని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆ దారిలో ఉన్న పొలాల్లో పనికి రావడానికి కూలీలు సైతం నిరాకనిరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి గురించి ఫిర్యాదు చేయడానికి కూడా భయంగా ఉందని చెప్పారు. సమస్య గురించి నోరెత్తితే ఏ కేసు పెడతారో అని నిస్సహాయస్థితిలో ఉన్నామని బాధిత రైతులు పేర్కొన్నారు.
7 కిలోమీటర్లు 700 గుంతలు - వణుకూరు అంటే వణుకుతున్న వాహనదారులు
No Funds For Road Consructions : నిధులు విడుదలలో జాప్యమే కారణామా? రోడ్డును నిర్మిస్తున్న గుత్తే దారులకు సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతోనే నిర్మాణాల్లో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. దీంతో గుత్తేదారులు ఏమీ చేయలేక పనుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖర్చు పెట్టిన నిధులు మంజూరు కాకపోవడంతోనే గుత్తేదారులు పనులను చేపట్టడం లేదని మండల ఇంజనీరింగు అధికారి వీరేష్ దృష్టికి తీసుకెళ్లగా, వీరేష్ ఆ దారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయామన్నారు. రోడ్డు నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న రీతిలో ఉన్నాయంటున్నారు గ్రామస్తులు.
మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్‌రోడ్డుకు గ్రహణం - వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు