ETV Bharat / state

గురుకుల భవన నిర్మాణం పూర్తి చేయాలని ధర్నా - ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల భవన నిర్మాణ వార్త

అనంతపురం జిల్లా కొర్రపాడులో ఏపీ బాలయోగి గురుకుల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దళిత సంఘాలు అనంతపురం - తాడిపత్రి రహదారిపై ధర్నా చేపట్టాయి. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన పనులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయాయని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు.

protest to start gurukula building in korrapadu in anantapuram
కొర్రపాడులో గురుకుల భవన నిర్మాణం పూర్తి చేయాలని ధర్నా
author img

By

Published : Apr 16, 2021, 9:02 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలోని ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని దళిత సంఘాలు అనంతపురం - తాడిపత్రి రహదారిపై ధర్నా నిర్వహించాయి. 2013లో రూ.13 కోట్ల వ్యయంతో ప్రారంభించినప్పటికీ.. కాంట్రాక్టర్లు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్మాణం పూర్తి కాలేదని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ సాయి ప్రసాద్ ధర్నా వద్దకు చేరుకొని నిరసనకారులతో మాట్లాడారు. సంబంధిత కాంట్రాక్టర్లు, ప్లానింగ్ అధికారులతో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభించేలా చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ధర్నా విరమించారు.

ఇదీ చదవండి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.