ETV Bharat / state

'నూతన సాగు చట్టాలను రద్దు చేయాలి' - విజయవాడలో ఆందోళన

దిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకుడా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

protest in vijayawada, vizianagram, ananthapruram to demand cancel agriculture laws
దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా నిరసనలు
author img

By

Published : Dec 26, 2020, 4:18 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా... విజయవాడలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ... ప్రధాని మోదీ వారి సమస్యలను పరిష్కరించడం లేదని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు ఆగ్రహించారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకే భాజపా ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ నెల 27,28 తేదీల్లో రైతులు చేపట్టే నిరసనలకు డీవైఎఫ్ఐ సంఘీభావం తెలుపుతుందని స్పష్టం చేశారు.

విజయనగరంలో...

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ దీక్షలు డిసెంబర్ 30 వరకు కొనసాగుతాయని సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు, చల్లా జగన్ తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురంలో...

అనంతపురంలో రైతు సంఘం నాయకులు దీక్షలు చేపట్టారు. కేంద్రం రైతులపై వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. రైతు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం రైతులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. రైతులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకుడా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

తెలంగాణ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు టాటా ట్రస్టు ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.