అనంతపురంలో హత్యకు గురైన యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కాగడల ప్రదర్శన చేపట్టారు. తెదేపా, కాంగ్రెస్ తదితర పార్టీల ఆధ్వర్యంలో మండలంలోని ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేశారు. యువతి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం: మంద కృష్ణ