అనంతపురం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులైన వారిని జాబితానుంచి తొలగించి నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ మెళవాయి గ్రామ సచివాలయం కార్యాలయం ఎదుట మడకశిర మండలం సిద్ధగిరి గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న తాము పడిపోయిన, పైకప్పులేని ఇళ్లలో వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ జీవిస్తున్నామని పలువురు వాపోయారు. ఇల్లు కట్టుకునేందుకు తమకు అర్హత ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో పేర్లు తొలగించారని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు విన్నవించుకున్నా స్పందించలేదన్నారు.
"రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధగిరి గ్రామానికి 85 ఇళ్లు మంజూరయ్యాయి. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రలో వచ్చినప్పుడు మా సమస్యను వివరించగా అధికారంలోకి వచ్చాక ఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నవరత్నాల్లో భాగంగా ఇళ్ల కోసం మా గ్రామంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మెళవాయి గ్రామ సచివాలయ ఓ అధికారి అర్హుల జాబితాలో ఉన్న వీరిని విద్యుత్ వాడకం అధికంగా ఉందని సాకు చెప్పి అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు". అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి
ఇదీ చదవండి :