అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన గంగరాజుకు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం బంధువులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం పలు ఆస్పత్రులు తిరిగినా ఎవరూ చేర్చుకోలేదు. చివరకు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం సాయంత్రం గంగరాజు మృతి చెందాడు. సరైన వైద్యం అందకపోవడంతో బాధితుడు మృతిచెందాడని మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీచదవండి.