అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయాన్ని పునరుద్ధరించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంగళవారం సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు విమానాశ్రయాన్ని పరిశీలించారు. విమాన విడిభాగాలు, డ్రోన్ కెమెరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుతో పాటు విమాన రాకపోకలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని ట్రస్టు సహకారంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురానుంది. ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెస్‌మెంట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, కర్నూలు విమానాశ్రయం డైరెక్టరు కైలాస్, తహసీల్దార్ గోపాలకృష్ణ, డీఎస్పీ రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: