అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో కోవిడ్ ముందస్తు పరీక్షలు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వలస కూలీలకు, బ్యాంకు ఉద్యోగులకు ఈ పరీక్షలు చేపట్టారు. విడపనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఎస్సై గోపి.. వారి సిబ్బంది ముందుగా ఈ పరీక్షలు చేయించుకున్నారు. వలస కూలీలకు దగ్గు, జలుబు, జ్వరం ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: