ETV Bharat / state

రాష్ట్రమంతటా హనుమాన్​ జయంతి వేడుకలు - ప్రకాశం జిల్లా హనుమాన్​ జయంతి తాజా వార్తలు

ఆదివారం రాష్ట్రమంతటా హనుమాన్​ జయంతి వేడుకలను జరుపుకొన్నారు. కొన్ని చోట్ల నిరాడబరంగా జరగగా... మరికొన్ని ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించి నిర్వహించారు. లక్ష తమలపాకులతో, గారెలతో, హోమాలతో స్వామి వారిని అర్చకులు భక్తిశ్రద్ధలతో పూజించారు. పలు చోట్ల అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు.

http://10.10.50.85//andhra-pradesh/17-May-2020/ap_atp_41_17_hanumad_jayanthi_vedukalu_av_ap10095_1705digital_1589708847_1061.txt
హనుమాన్​ జయంతి వేడుకలు
author img

By

Published : May 17, 2020, 9:00 PM IST

  • తూర్పుగోదావరి జిల్లా

పి. గన్నవరం నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో హనుమజ్జయంతి నిరాడంబరంగా నిర్వహించారు. లాక్​డౌన్​ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పలు గ్రామాలలో ఆంజనేయస్వామికి అర్చకులు పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

  • అనంతపురం జిల్లా

పెనుకొండలోని ఊరి వాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో హనుమాన్​ జయంతిని జరుపుకొన్నారు. ఆదివారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాలతో స్వామి వారిని అలంకరించారు. పలువురు భక్తులు 101 వడలతో హారం కూర్చి స్వామివారికి అలంకరించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు ఆంజనేయ ఆలయాల్లో హనుమాన్ జయంతిని నిరాడంబరంగా జరిపారు. కంబదూరు మండలం తిమ్మాపురంలో ప్రతియేటా ఆడంబరంగా అన్నదానం, భజన వంటి కార్యక్రమాలతో నిర్వహించే వేడుకలను కరోనా కారణంగా ఒకరిద్దరితో నిరాడంబరంగా నిర్వహించుకున్నారు.

కదిరి పట్టణంలోని గరుడ ఆంజనేయ స్వామి గుడిలో ఖాద్రి రక్షక్​ దళ్​ సభ్యులు పూజలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని శోభాయమానంగా అలంకరించారు. ప్రసన్నాంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామితో పాటు రామాలయాలలో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలు జరుపుకున్నారు.

రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లులో సుప్రసిద్ధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమాన్​ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు.

  • ప్రకాశం జిల్లా

కరోనా వైరస్ నేపథ్యంలో చీరాలలో హనుమాన్ జయంతి నిడారంబరంగా జరిగింది. పేరాలలోని బాల వీరంజనేయ దేవాలయంలో అర్చకులు కారంచేటి నగేష్​ కుమార్ ఒక్కరే హనుమంతునికి పూజాదికాలు నిర్వహించారు. చీరాల బోస్​నగర్​లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో భక్తులు లేకుండానే పూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. కరోనా మహమ్మారి త్వరగా అంతరించి దేశ, రాష్ట్ర ప్రజలకు సాధారణ పరిస్థితులు రావాలని హనుమంతుని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు చెప్పారు.

ప్రకాశం జిల్లాలో సింగరకొండలో 99 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద కార్య నిర్వాహక సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పక్కనే ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి వేదపండితులు అభిషేకం చేశారు. అనంతరం లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. కరోనా నివారణ నిమిత్తం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్​డౌన్​ నేపథ్యంలో వేద పండితులు స్వామివారికి ఏకాంతపు పూజలు నిర్వహించారు.

  • శ్రీకాకుళం జిల్లా

ఆమదాలవలసలోని మూతపడ్డ చక్కెర కర్మాగారం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సామాజిక దూరం పాటించి స్వామివారికి సహస్ర తమల అర్చన , సింధూర అర్చన, గారెలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • విజయనగరం జిల్లా

విజయనగరంలో హనుమాన్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనగరం పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ దుర్గా మహా పీఠాధిపతులు శ్రీ సమతా నంద స్వామి, శ్రీ శ్రావణ చైతన్యా నంద చిన్నస్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

  • విశాఖపట్నం

సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిపారు. స్వామివారి మెట్ల మార్గంలో ఉన్న ఆలయంలో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదా పీఠంలో ఉన్న హనుమంతుని విగ్రహాలకు స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యేకాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఎవరికి అనుమతి ఇవ్వలేదు.

అనకాపల్లి విజయరామరాజుపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. పలక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 108 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ పలక రవి చేతుల మీదుగా వీటిని అందజేశారు.

ఇదీ చదవండి :

భక్తులు లేకుండానే కసాపురం ఆంజనేయ స్వామి ఉగాది ఉత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.