ETV Bharat / state

'ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించటం సరైంది కాదు' - protest against hike of taxes news

పురపాలక, నగరపాలక సంస్థల్లో ఆస్తిపన్ను, మంచి నీరు, డ్రైనేజీ ఛార్జీలు వేయరాదని కోరుతూ అనంతపురం, విశాఖ జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పన్నుల పెంపు వల్ల ప్రజలపై భారం పడుతుందన్నారు.

praja bheri meeting
పట్టణ ప్రజా బేరి సదస్సు
author img

By

Published : Dec 28, 2020, 9:04 PM IST

ఆస్తి పన్ను పెంపు విధానాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో పట్టణ ప్రజా భేరి సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తీరు ప్రమాదకరమని పట్టణ పౌర సేవా సమాఖ్య రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు, పన్ను చెల్లింపుదారుల సంఘం నాయకుడు ఆంజనేయులు అన్నారు. పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు.

పన్ను పెంపు వల్ల ప్రజలపై పెను భారం పడుతుందన్నారు. డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడానికి, చెత్తను సేకరించి పారి వేయడానికి పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. ఇది చాలనట్టు ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచడం దారుణమన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాలు పన్నులు పెంచి.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ..చట్టాలను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.

విశాఖ జిల్లా:

పురపాలక, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్ను, మంచి నీరు, డ్రైనేజీ ఛార్జీలు వేయరాదని కోరుతూ వార్వ నివాస్ సంస్థల ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించాలని నిర్ణయించడం సరైంది కాదని సంస్థల కార్యదర్శులు అన్నారు. మున్సిపల్ చట్ట సవరణలు రద్దు చేయాలని..పాత విధానం కొనసాగించాలని డిమాండ్​ చేశారు. కరోనా కారణంగా 2020 -21, 2021- 22 సంవత్సరాలలో 50 శాతం రాయితీ ఇవ్వాలని 24%అపరాధ రుసుం పూర్తిగా రద్దు చేయాలని కుమారమంగళం స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో నివాస్ నాయకులు దండు నాగేశ్వరరావు, ఎం.వి.త్రినాథ్, చంటి, కృష్ణారావు, మణి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'పాదయాత్రలో అనేక హామీలిచ్చారు.. ఇప్పుడు విస్మరించారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.